Chandrababu : నేడు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు

Update: 2025-12-25 03:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వస్తారని తెలిసి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి తరలి వస్తున్నారు.

నేతలతో భేటీ...
ప్రజల నుంచి వినతులను స్వీకరించి అక్కడికక్కడే అధికారులను ఆదేశించనున్నారు. సమస్యల పరిష్కారం చేయాలని సూచించానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమవుతారు. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు జాతీయ కమిటీ కూర్పుతో పాటు నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు.


Tags:    

Similar News