Andhra Pradesh : నేడు దుబాయ్ కి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు.

Update: 2025-10-22 01:51 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 7.30 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఈరోజు ఉదయం 10.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దుబాయ్ కి చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు వెంట సీఎంవో అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా వెళ్లనున్నారు.

పారిశ్రామికవేత్తలతో...
దుబాయ్ లో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు. అలాగే తెలుగు వారితో కూడా ప్రత్యేకంగా సమావేశమవుతారు. వచ్చే నెల 14, 15వ తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హాజరై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరనున్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి తేవడంలో భాగంగానే చంద్రబాబు యూఏఈ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు.


Tags:    

Similar News