ప్రకాశం బ్యారేజీ కి పెరుగుతున్న వరద ఉధృతి
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక కొనసాగుతుంది. ఈరోజు, రేపట్లో 4.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఘాట్లలో భద్రతా చర్యలు...
అత్యవసర సహాయక చర్యల కోసం విజయవాడ ఘాట్లలో ఐదు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రులు జరుగుతుండటంతో రా ఉత్సవాలు సందర్భంగా అధికార యంత్రాంగానికి ప్రత్యేక సూచనలు ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ చేసింది. నది ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, భద్రతా చర్యలకు పోలీసు, నీటిపారుదల, మునిసిపల్ సిబ్బంది ఘాట్ల దగ్గర ఉండాలని, నది ప్రమాద స్థాయి తెలియజేసే బారికేడింగ్‌లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. భక్తులు అధికారులకు సహకరించాలని తెలిపింది