Andhra Pradesh :ఏపీలో 28 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉత్తర్వుల విడుదల

కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2025-12-30 12:21 GMT

కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జిల్లాలుగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రేపటి నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఎనిమిది జిల్లాలకు సంఖ్య చేరుకున్నట్లయింది.

రెవెన్యూ డివిజన్లను కూడా...
రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికు మారుస్తూ కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ కూడా తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రేపటి నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి.


Tags:    

Similar News