Andhra Pradesh : నాలుగు వేల కోట్ల రుణం కోసం ఏపీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల రుణాన్ని సేకరించేందుకు సిద్ధమయింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల రుణాన్ని సేకరించేందుకు సిద్ధమయింది. ప్రతి నెల మొదటి వారం వచ్చే సరికి సిబ్బంది వేతనాలు, సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెల రుణ సమీకరణను చేస్తూనే ఉంది. అందులో భాగంగా వచ్చే నెలకు సంబంధించి రుణ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
ఈ నెల 30న రిజర్వ్ బ్యాంకులో...
రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రుణం సమీకరించనుంది. ఈ నెల 30న రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణంగా స్వీకరించనుంది. వేర్వేరుగా రూ.1,000 కోట్ల చొప్పున 9, 10, 12, 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా ఈ అప్పు తీసుకుంటున్నారు. ఎంత వడ్డీకి ఈ రుణం లభిస్తుందనేది డిసెంబర్ 30న ఖరారవుతుంది.