ఒక్క క్లిక్ తో మీకు కావాల్సిన సమాచారం.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పౌరసరఫరాల శాఖకు సంబంధించి మనమిత్ర వాట్సాప్ నెంబరును అందుబాటులోకి తెచ్చింది. పౌర సరఫరాల శాఖ ఈ మేరకు ప్రకటించింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత ఆధునికరీంచే పనిలో భాగంగా వాట్సాప్ సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా 9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు...
క్లిక్ చేసిన వెంటనే...
వెంటనే ప్రభుత్వంలోని వివిధ శాఖలు కనిపించనున్నాయి. వాటిలో పౌరసరఫరాల శాఖ అని క్లిక్ చేస్తే ఈ శాఖ ద్వారా అందించే సేవలు కనిపించనున్నాయయి. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. తాజాగా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందుబాటులోకి తేవడంతో ప్రజలకు వెంటనే ఖచ్చితమైన సమాచారం అందుతుందని అధికారులు చెబుతున్నారు.