Chandrababu : నేడు గుంటూరుకు చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం 10.35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. ఉదయం10.45 గంటలకు మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 12.50 గంటలకు రాష్ట్ర సచివాలయానికి చంద్రబాబు చేరుకుంటారు.
ఆర్జీజీఎస్ పై సమీక్ష...
నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. సమీక్షిస్తారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును గురించి అడిగి తెలుసుకుంటారు. అనంతరం చంద్రబాబు నాయుడు 6.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.