Chandrababu : నేడు విదేశీ పర్యటనకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో జరుపుకోనున్నారు. గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చంద్రబాబు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
వచ్చే నాలుగో తేదీన తిరిగి...
వ్యక్తిగత పర్యటనపై నేడు కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు అక్కడే నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. వచ్చే నెల 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు. నాయుడు తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి విదేశాలకు నాలుగు రోజులు రాష్ట్రంలో అందుబాటులో ఉండరు. అయితే పాలన పరమైన వ్యవహారాలన్నీ సక్రమంగా జరిగేలా అన్ని చూసుకుంటున్నారు. ఈ నెల పింఛను పంపిణీలో కూడా చంద్రబాబు పాల్గొనే అవకాశం లేదు. ఈ నెల 31వ తేదీన జనవరి నెల పింఛను పంపిణీ జరగనుంది.