Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో భూ కేటాయింపులపై చర్చించే అవకాశముంది.
భూముల కేటాయింపులు...
వివిధ పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటంతో వారికి విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో భూముల కేటాయింపుపై చర్చించి నిర్ణయించనున్నారు. దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు.. రహదారుల అభివృద్ధితో పాటు వివిధ కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.