Andhra Pradesh : నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి 7380.70 కోట్లు రుణం తీసుకునేందుకు సీఆర్డీఏకి అనుమతికి మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు రూ.532 కోట్ల మేర ఆమోదం మంత్రివర్గం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతిని మంత్రి వర్గ సమావేశం ఇవ్వనుంది.
రాజధానికి రుణాన్ని...
రూ.169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. 163 కోట్ల రూపాయల వ్యయంతో జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. . 20 వేల కోట్లు పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాలు కల్పనకు మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనునుంది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకునే అ వకాశముంది. రాజధాని అమరావతి పనులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.