Andhra Pradesh : నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2025-09-18 01:54 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీ వర్షా కాల సమావేశాలను వారం నుంచి పది రోజులు నిర్వహించే అవకాశముంది. ఈరోజు జరిగే బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహిస్తారన్నది తేలనుంది. ఈ సమావేశంలో అధికార పార్టీ కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది.

ప్రత్యేక బిల్లులు...
ఇందులో ఆరు ఆర్డినెన్స్ ల స్థానంలో బిల్లులును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అదే సమయంలో పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ, ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ 2025 స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యమైన అంశాలపై సభలో చర్చించనున్నారు.


Tags:    

Similar News