Andhra Pradesh : నేడు ఆరో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి

Update: 2025-09-25 02:24 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యే సమావేశాల్లో అనంతరం జీరో అవర్ లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రులు నోట్ చేసుకుని ఎమ్మెల్యేలకు తర్వాత లిఖితపూర్వకంగా సమాధానమిస్తారు. ఈరోజు నౌకానిర్మాణ పరిశ్రమలు, రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ, కోవూరు నియోజకవర్గంలోకాలువలపై వంతెనలు, నిరుద్యోగ భృతి, అటవీ భూముల నుంచి కావాలి అటవీ గ్రామాలను డీ రిజర్వ్ చేయడంపై సభ్యులు ప్రశ్లనులు వేశారు.

కీలక బిల్లులకు ఆమోదం...
ఈరోజు ప్రభుత్వం అనేక బిల్లులును సభలో ప్రవేశపెట్టి ఆమోదించనుంది. ప్రధానంగా మున్సిపల్ సవరణ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో తీసుకున్న చర్యలతో పాటు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ లు వంటి వాటిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం సభ్యులకు వివరించనుంది.


Tags:    

Similar News