Andhra Pradesh : నేడు చలో విజయవాడ యధాతధం

ఆంధ్రప్రదేశ్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ మహా ధర్నా నేడు జరగనుంది

Update: 2025-10-23 02:48 GMT

ఆంధ్రప్రదేశ్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ మహా ధర్నా నేడు జరగనుంది. ఈరోజు చలో విజయవాడకు అసోసియేషన్ పిలుపు నిచ్చింది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా చేస్తామని ప్రకటించాయి. ఆరోగ్య సేవలకు సంబంధించిన బకాయీలను విడుదల చేయాలని ఈ ధర్నాకు అసోసియేషన్ పిలుపు నిచ్చింది. అయితే ప్రభుత్వం బకాయీలలో 250 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కానీ 250 కోట్ల రూపాయలు తమ బకాయీలకు విడుదల చేస్తే సరిపోవని అసోసియేషన్ అభిప్రాయపడింది.

బకాయీలను విడుదల చేయాలని...
2,700 కోట్ల రూపాయల నిదులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ మహాధర్నా జరగనుంది. పూర్తి బకాయీలు చెల్లించేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అసోసియేషన్ తెలిపింది. ఈ నెల 10వ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపి వేసిన నేపథ్యంలో ప్రభుత్వం నిన్న 250 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తం తమకు సరిపోవని తెలుపుతూ నేడు తమ ధర్నా ను కొనసాగిస్తామని తెలిపింది. ఆందోళనను కూడా కొనసాగిస్తామని చెప్పింది.


Tags:    

Similar News