Andhra Pradesh : చీఫ్ సెక్రటరీ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడగించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్న విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మరోమూడు నెలలు...
చీఫ్ సెక్రటరీగా విజయానంద్ పదవీ కాలాన్ని 2026 ఫిబ్రవరి 28 వరకూ పొడిగించేందుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.వాస్తవానికి ఈనెల 30న సిఎస్ విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. విజయానంద్ డిసెంబరు 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు పోడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.