Chandrababu : టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు

Update: 2025-11-29 06:07 GMT

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. నేరుగా సీఎం చంద్రబాబు నాయుడును కలిసే అవకాశముండటంతో వారు వచ్చి మాట్లాడేందుకు వీలుంటుందని ఎక్కువ మంది పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు.

అందుబాటులో ఉన్న నేతలతో...
అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. రాష్ట్ర కమిటీ, పార్లమెంట్‌ అధ్యక్షులపై చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. కూటమి పార్టీల మధ్య నెలకొన్న సఖ్యతను కొనసాగించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడంపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి వస్తున్న సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News