హైదరాబాద్ లో మళ్ళీ కలకలం ...

Update: 2017-11-26 03:30 GMT

హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా తోక ఇక ముడిచిందని అంతా భావించారు. కానీ అది ఇంకా విస్తరిస్తోందన్న సత్యం పోలీస్, ఎక్సయిజ్ శాఖలు చేస్తున్న దాడుల్లో తేలిపోయింది. ముగ్గురు విద్యార్థుల దగ్గర 500 ల గ్రాముల మాదకద్రవ్యాలతో పట్టుబడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. కొద్దినెలల క్రితం రేగిన డ్రగ్స్ కలకలం అంతా మరిచిపోక ముందు నగర శివారు ప్రాంతంలోని శాంతినగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎక్సయిజ్ , సిట్ బృందాలు దాడులు నిర్వహించి పట్టుబడిన విద్యార్థులను చూసి నివ్వెరపోయారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేశారన్న అనుమానంతో ఇంజనీరింగ్ విద్యార్థి అరవింద్, ఐటీ ఐ విద్యార్థులు శ్రవణ్, హేమంత్ లను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.

తల్లితండ్రుల్లో ఆందోళన ...

పసివారి దగ్గర భారీమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం భాగ్యనగర్ తల్లితండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది. విద్యాలయాల్లోకి డ్రగ్స్ మహమ్మారి వ్యాప్తి వేగంగా చెందుతున్న తీరు ఇటీవల సిట్ సైతం బయట పెట్టింది. సినీ ప్రముఖలు విచారణ జరిపింది. నగరంలోని పబ్ నిర్వాహకులను విచారించి హెచ్చరించింది. అన్ని స్కూల్స్ కళాశాలలను హెచ్చరించింది పలువురికి కౌన్సిలింగ్ సైతం చేసినా పరిస్థితి లో ఏ మార్పు రాలేదన్న సత్యం వెలుగు చూడటం అధికారులను సైతం కలవర పరుస్తుంది. తెలంగాణ రాజధానిలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా పై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపాల్సిన అవసరాన్ని తాజా సంఘటన మరోసారి గుర్తు చేసింది. మరి దీనిపై ప్రభుత్వం ఏమేరకు సీరియస్ గా యాక్షన్ లోకి దిగుతుందో చూడాలి.

Similar News