వైసీపీ అధినేత జగన్ ఈరోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. శుక్రవారం కావడంతో ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. వరుస సెలవుల కారణంగా గత మూడు శుక్రవారాల నుంచి జగన్ కోర్టుకు హాజరులేదు. దీంతో పాదయాత్ర బ్రేక్ లేకుండా జరిగింది. అయితే ఈ శుక్రవారం విధిగా కోర్టుకు హాజరు కావాల్సి రావడంతో ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న పాదయాత్రకు ఈ రోజు విరామం ప్రకటించారు. ఆయన విమానంలో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. తిరిగి సాయంత్రం విమానంలో తిరుపతి చేరుకుని రేపటి నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు.