హార్థిక్ సెన్సేషనల్ సవాల్

Update: 2017-11-28 18:29 GMT

తనపై వచ్చిన ఆరోపణలను పటీదార్ అనామత్ ఆందోళన నేత హార్ధిక్ పటేల్ ఖండించారు. భారతీయ జనతా పార్టీ మురికిరాజకీయాల వల్లనే ఇటువంటి సంఘటనలు గుజరాత్ లోచోటు చేసుకుంటున్నాయన్నారు. హార్థిక్ పటేల్ మహిళలతో అసభ్యంగా ఉన్న వీడియోలను ఇటీవల బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదన్నారు హార్థిక్. ఒక జాతీయ మీడియాకుఇచ్చిన ఇంటర్వ్యూలోఆయన బీజేపీపై మండిపడ్డారు. తన వ్యక్తిగత జీవితం గురించి బీజేపీకి ఎందుకని ఆయన ప్రశ్నించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు హార్థిక్.

రెండు కోట్లు ఇస్తే....

తనకు రెండు కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్స్ వీడియోలను కూడా తాను రిలీజ్ చేయగలనని సంచలన ఆరోపణలు చేశారు హార్థిక్. ఎవరివో వీడియోల్లో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు. తనపై బురద జల్లేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ నమ్మరని హార్థిక్ చెప్పారు. గుజరాత్ ప్రజలు సీడీల కోసం ఎదురు చూడటం లేదని, పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, ముందు వాటి గురించి చెప్పాలని బీజేపీ నేతలకు హార్థిక్ సవాల్ విసిరారు.

Similar News