హనీప్రీత్ కు ఈఏడాది మొత్తం అమావాస్యగానే మారినట్లుంది. డేరాబాబా అరెస్ట్ తర్వాత అల్లర్లు జరిగిన కేసులో హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హనీప్రీత్ ప్రస్తుతం అంబాలా సెంట్రల్ జైలులో ఉన్నారు. దీపావళి సందర్భంగా హనీప్రీత్ ను ఆమె కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా హనీప్రీత్ కన్నీరు మున్నీరయ్యారు. తనకే పాపం తెలియదని, తనను అనసవరంగా ఈ కేసులో ఇరికించారని హనీప్రీత్ వారి కుటుంబసభ్యుల ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. దీపావళికి కానుకలు తీసుకుని హనీప్రీత్ తల్లిదండ్రులు ఆశా, రామానంద్, సోదరుడు సాహిల్ ఆమెను జైలులో కలుసుకున్నారు. కుటుంబసభ్యులు రావడంతో హనీప్రీత్ బోరును విలిపించారట. తనకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్నానని ఆమె వెక్కి వెక్కి ఏడ్చారట.
ఆస్తులు స్వాధీనానికి......
హనీప్రీత్ పోలీస్ కస్టడీ ముగియడంతో అంబాలా జైలులోనే ఉంటున్నారు. జైలులో సాధారణ ఖైదీగా ఉన్న హనీప్రీత్ తనకు బెయిల్ వచ్చేలా చూడాలని తనను కలుసుకునేందుకు వచ్చిన న్యాయవాదిని కోరారు. హనీప్రీత్ పై నమోదయిన కేసు విషయంలో ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. డేరా బాబా అరెస్ట్ అయిన తర్వాత జరిగిన అల్లర్లలో దాదాపు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు బూడిదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ కేసులో ఎ1 నిందితురాలిగా ఉన్నారు. జైలులో ఆహారం కూడా తీసుకునేందుకు హనీప్రీత్ నిరాకరిస్తున్నారట. దీపావళికి తల్లిదండ్రులు తెచ్చిన స్వీట్స్ తోనే కడుపు నింపుకున్నారట. మొత్తం మీద జైలులో ఉండేందుకు హనీప్రీత్ విలవిలలాడిపోతున్నారు. మరోవైపు ముంబయి, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో ఉన్న హనీ ప్రీత్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు న్యాయపరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.