మీకు ఎవరిమీదైనా కోపం ఉందా... ఆ వ్యక్తిని చూడగానే చంపేయాలన్న ఆవేశం వస్తోందా.. అందు కోసం ఓ కత్తో లేక తుపాకీనో ఉంటే బాగుండని పిస్తోందా.. మరీ స్నాప్ డీల్ చూశారా మరీ.. అవును మీరు వింటుంది నిజమే.. ఆన్ లైన్ మార్కెట్ లో దొరకంది అంటూ ఏమీ లేదండీ.. తల్వార్ నుండి తపంచా వరకు..ఏది కావాలన్నా ఇట్టే దొరుకుతుంది.. నిజం.. కావాలంటే ఇది చదివి తెలుసుకోండి.
ముఠా గుట్టురట్టు....
ఆన్ లైన్ లో మారణాయుధాలను కొనుగోలుచేస్తున్న కొందరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆయుధాలను సరఫరా చేసింది స్నాప్ డీల్ సంస్థ. ఫ్రీ హోం డెలివరీచేసేసింది. వీటికి నెలసరి వాయిదాల్లో కూడా డబ్బు చెల్లించే వీలు కల్పించారు. ఒకముఠా తమ వద్ద రణాయుధాలున్నాయని...కావాలంటే కొనుగోలుచేసుకోవచ్చని ఆన్ లైన్ లో బిజినెస్ స్టార్ట్ చేసింది. మంగళ్ హాట్ కు చెందిన అమన్ సింగ్ కి ఓ ఐడియా వచ్చింది. తన మరో 12 మంది స్నేహితులను కలుపుకొని ఆన్ లైన్ లో అది స్నాప్ డీల్ లో మారణాయుధాలు విక్రయించడం మొదలు పెట్టాడు. అదికూడా ఎలాగో తెలుసా.. క్యాష్ ఆన్ డెలవరీ... ఇన్ స్టాల్ మెంట్,డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపులు సౌకర్యాలు కూడా కల్పించారు.. ఈ విషయం పసిగట్టిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సిటీలోని మంగళ్ హాట్,మెహదీ పట్నం. బహదూర్ పురా, అంబర్ పేటలోని ఈ ముఠాస్థావరాలపై దాడులు జరిపారు. 12 మంది నిందితుల్లో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి పెద్ద ఎత్తున తల్వార్లు, డాగర్లు వంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తరహాలో ఇంకా ఏవైనా ముఠాలు ఆన్ లైన్ లో ఇలాంటి వ్యాపారాలు సాగిస్తున్నారా అన్న వ్యవహారాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.