సెల్ఫీ తీసుకుని మరీ సూసైడ్...ఎందుకంటే?

Update: 2017-10-07 00:30 GMT

హైదరాబాదు నగరంలో కానిస్టేబుల్ తనీ కూమార్ ఆత్మహత్య చేసుకున్నాడు ..ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది . గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కానిస్టేబుల్ చెప్పాడు..తాను చనిపోయే ముందు ఒక సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. గత నాలుగు సంవత్సరాల నుంచి వీరు ఇద్దరూ ప్రేమించుకున్నారు. సంతోష్ నగర్ నుంచి ఇటీవల కాలంలో తనీ కూమార్ చిలకల గూడ పోలీసు స్టేషన్ కు బదిలీ కావడం జరిగింది. పాత బస్తీకి వెళ్లి ప్రతినిత్యం కూడా తన ప్రేయసిని కలిసి వస్తుండే వాడు.. నాలుగేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది.. దీంతో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. మొత్తం మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేయడం జరిగింది. చాలా అందంగా కనబడే కానిస్టేబుల్ ఒక్కసారిగా అందవికారంగా మారిపోయారు. దీంతో ప్రేమించే యువతి ఇతన్ని చీత్కారం కొట్టింది.

ప్రియురాలు దూరమై.....

కొన్ని రోజులుగా కానిస్టేబుల్ ను తన ప్రియురాలు దూరంగా ఉంటూ వచ్చింది . గత నాలుగు నెలల నుంచి తన ప్రియురాలితో కానిస్టేబుల్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాని ప్రియురాలు మాత్రం అంతేకాకుండా ఇతని ఫోన్ ను కూడా బ్లాక్ లిస్ట్ లొ పెట్టింది. దీంతో తీవ్ర మన స్థాపానికి గురైన కానిస్టేబులు...పోలీస్ స్టేషన్లో విధులు పూర్తి చేసుకుని అర్ద రాత్రి సమయయంలో ఇంటికి వచ్చాడు కానిస్టేబుల్ . నిన్న రాత్రి రెండు గంటలకు పని ముగించుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత భోజనం చేసి పడుకుంటానని చెప్పి తన గదికి వెళ్లిపోయాడు. తెల్లవారి లేచి తల్లిదండ్రులు కానిస్టేబుల్ని లేపే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని తన గదిలో పడి పోయి వున్నాడు. కానిస్టేబుల్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ సెల్ ఫొన్ లో వున్నా సెల్ఫీ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రేమించి విఫలమై.....

సెల్ ఫోన్లో ఒక వీడియో కనపడింది. ఎనిమిది నిమిషాల పాటుగా ఈ సెల్పీని రికార్డు చేసిన కానిస్టేబుల్ చాలా విషయాలు చెప్పడం జరిగింది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ తాను పనిచేస్తున్న సమయంలో ఒక చేతితో తనకు పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని తామిద్దరం కూడా గత కొంతకాలం నుంచి ప్రేమించు కుంటున్నామని, అయితే ఇటీవల కాలంలో తనకు పూర్తిగా దూరం అయిందని, రోడ్డు ప్రమాదం జరిగి తనకు దెబ్బలు తగలడం, శరీర భాగాలు కూడా పని చేయకపోవడంతో ప్రియురాలికి తాను నచ్చలేదని ఇందులో చెప్పాడు. తన ప్రియురాల్ని ఎంతో మంచిగా చూసుకున్నాననిచ అందరికంటే చాలా బాగా చూసుకున్నానని ..చెప్పి ఉంటున్నానని తన చావుకు ఎవరూ బాధ్యులు కారని చెప్పి కానిస్టేబుల్ తన వీడియో లో పేర్కొన్నారు. దీని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దానికి విచారణ జరుపుతున్నారు

Similar News