ఇప్పుడు అందరి చూపు చిత్తూరు జిల్లా వైపే. ఈ సంక్రాంతి పండుగకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత జగన్ ఆ జిల్లాలోనే వేడుకలు సాగిస్తుండటంతో వారేం చేస్తున్నారనే ఆసక్తి అందరిలో బయల్దేరింది. చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తుంది .ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్, బ్రాహ్మిణి, మనుమడు దేవాన్ష్ , వియ్యంకుడు బాలకృష్ణ నారావారిపల్లె వచ్చేసారు. ఈ మూడు రోజులు కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో ఎంజాయ్ చేయనున్నారు ఏపీ సీఎం.
జగన్ పాదయాత్రకు విరామం ... కుటుంబం తో పండగ ...
తీవ్ర జలుబు, దగ్గులతో బాధపడుతున్న విపక్ష నేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయనకు రెండుమూడు రోజులు విశ్రాంతి అవసరమని ఇప్పటికే వైద్యులు సూచించారు. మరోపక్క వైసిపి ఎమ్యెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి లు సంక్రాంతి సంబరాలు తమ అధినాయకుడితో చేయించేందుకు ప్లాన్ చేశారు. కడప నుంచి జగన్ కుటుంబసభ్యులు చంద్రగిరి బయల్దేరారు. వారు పండగ మూడు రోజులు జగన్ తో గడపనున్నారు. పాదయాత్రకు విరామం ప్రకటించి కుటుంబంతో ఖుషి కానున్నారు జగన్. వైద్యుల సూచనలు పాటించనట్లు అవుతుంది. సో ఏపీ రాజకీయాలను శాసిస్తున్న ఇద్దరు నేతల పండగ సందడి చిత్తూరు జిల్లాను వార్తల్లో నిలపనున్నాయి.