సెంటిమెంట్ సీఎం

Update: 2018-03-18 02:30 GMT

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు సెంటిమెంట్స్ ఎక్కువ. సంప్రదాయాలకు, సంస్కృతికి ఆయన పెద్దపీట వేస్తారు. ఏ భారీ కార్యక్రమం కేసీఆర్ తలపెట్టినా జాతకాలు ముహుర్తాలు, తిధి, వారం, నక్షత్రం అన్ని చూస్తారు. ఇక దైవ కార్యక్రమాల్లో కేసీఆర్ తో పోటీపడే సీఎం దేశంలోనే లేరు. శతసహస్ర చండీ యాగాలతో ప్రధాని మోడీ తో ఆయన పోటీ పడతారనే చెప్పాలి. ముఖ్యమంత్రి కార్యాలయం వాస్తు మార్చడం, సచివాలయంలో వాస్తు సెట్ చేయడం కేసీఆర్ కె చెల్లింది. తెలంగాణ సచివాలయ వాస్తు సరిగ్గా లేదని దాన్ని వేరే చోటకు తరలించి ఎర్రగడ్డ ఆసుపత్రి ప్రాంతంలో నూతనంగా నిర్మించాలని కేసీఆర్ తలపెట్టారు కూడా. ఇక విజయదశమి, సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మంచి రోజు అనే ప్రారంభిస్తారు.

థర్డ్ ఫ్రంట్ కి అదే తీరు...

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రస్తుతం కేసీఆర్ సీరియస్ గా నిర్ణయించారు. దీనికి సంబంధించి ముహర్తం ప్రకారం మీడియా లో చెప్పారు ఆయన. కేసీఆర్ అలా ప్రకటించారో లేదో దేశవ్యాప్తంగా మూడో ఫ్రంట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న విపక్షాలు ఆయనతో ములాఖత్ కి సిద్ధం అయ్యాయి. వీరిలో ముందుగా ఆయన ఎంచుకున్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని. దానికీ కారణం వుంది. దేశానికి తూర్పున బెంగాల్ వుంది. తూర్పు దిక్కుతో ఏ కార్యం అయినా తలపెడితే దిగ్విజయం అవుతుందన్నది చాలా మంది సెంటిమెంట్. అందుకే చాలా రాష్ట్రాల నేతలను ఆయన కలవాలిసి వున్నా తూర్పున వున్న పశ్చిమబెంగాల్ సీఎం ను కలిశాకే థర్డ్ ఫ్రంట్ పని కేసీఆర్ వేగవంతం చేయనున్నారు. మరి ఆయన సెంటిమెంట్లు ఎంతవరకు ఫలిస్తాయో 2019 ఎన్నికలే తేల్చనున్నాయి. అదండి సంగతి.

Similar News