సీరియల్ స్టోరీలా జనసేన వివాదం ...!

Update: 2017-12-17 05:30 GMT

అమరావతి లో జనసేన కార్యాలయానికి కొబ్బరి కాయ కొట్టి వారం తిరక్కుండా లీజుకు తీసుకున్న స్థలం వివాదం లో ఉందంటూ అల్లరి మొదలైంది. ఇది తమదే అంటూ కొందరు ముస్లింలు రోడ్డెక్కారు. ప్రతిగా ఇదిగో కోర్టు కేసుల వివరాలంటూ ప్రత్యర్థి వర్గం మరోసారి ఈ వివాదం లోకి దిగడం చర్చనీయాంశంగా మారాయి. దీనిపై జనసేనాని స్పష్టత ఇచ్చారు. రాజకీయంగా జరిగే కుట్రగా తేలితే వదిలిపెట్టమని హెచ్చరించారు. అది నిజంగా వివాదాస్పదం అయితే వదులుకుంటామని చెప్పారు.

మరోసారి గౌతంరెడ్డి ముస్లిం సంఘాలు తెరపైకి ...

వైసిపి బహిష్కృత నేత గౌతమ్ రెడ్డి మరోసారి సవాల్ చేశారు. కొన్ని కోర్టు కాగితాలు చూపిస్తూ ప్రస్తుతం ఆ స్థలంలో ఉంటున్న వారు అన్న అంశాలు ఖండించారు. పవన్ కళ్యాణ్ కోరుకుంటే తన స్థలమే ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా వున్నానని గౌతమ్ రెడ్డి ప్రకటించారు. ఇంకా అనేక మంది అభిమానులు సైతం స్థలం ఇప్పడానికి ముందుకు వచ్చారని బిల్డింగ్ లు కట్టినవి కూడా ఇచ్చేందుకు వస్తున్నారని అన్నారు గౌతంరెడ్డి. ఇలా రెండు వర్గాలు కారాలు మిరియాలు నూరుతూ డైలీ సీరియల్ లా సాగిపోతున్నాయి. వాస్తవానికి సివిల్ క్రిమినల్ చర్యలు కోర్ట్ ద్వారా తీసుకునే అవకాశం వున్నా ఇరువర్గాలు మీడియా ముందే సవాళ్లు ప్రతి సవాళ్ళు విసురుకోవడం గమనార్హం.

Similar News