సీమలో జగన్ సక్సెస్ కావడంతో....!

Update: 2018-01-17 01:30 GMT

సింహపురి లోకి జగన్ అడుగుపెట్టనున్నారు. ఈ నెల మూడోవారంలో జగన్ నెల్లూరు జిల్లాకు చేరే అవకాశం ఉంది. దీంతో వైసీపీ నేతలు నెల్లూరు జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రారంభమైంది. ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యాత్ర ముగించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మరో వారం రోజుల్లో జగన్ పాదయాత్ర పూర్తి కానుంది.

పీకే రిపోర్ట్ లో కూడా....

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోనూ ఆయన కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో సీమ జిల్లాల్లో జగన్ పాదయాత్ర సక్సెస్ అయినట్లేనని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ టీం కూడా పాదయాత్ర పూర్తయిన మూడు జిల్లాల్లోనూ వైసీపీ బలం పుంజుకుందని నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా వైసీపీ శ్రేణుల్లోనూ జోష్ నింపిందని పీకే టీం రిపోర్ట్ లో వెల్లడయింది.

నెల్లూరుకు మరో నాలుగు రోజుల్లో.....

సీమ జిల్లాల్లో సక్సెస్ అయిన జోష్ తో ఇక ఆంధ్ర ప్రాంతంలో కూడా పాదయాత్రను విజయవంతం చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. చిత్తూరు జిల్లా నుంచి జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. మరో నాలుగు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర చేరుకునే అవకాశముండటంతో ఈరోజు నెల్లూరులో వైసీపీ సీనియర్ నేతలు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశఆరు. జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను ఈరోజు ఖరారు చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కొనసాగే అవకాశముంది.

Similar News