బీజేపీ, జనసేన, వైసీపీలు టీడీపీపైన దాడి చేస్తున్నాయని, దానిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. ఉదయం పార్టీ పార్లమెంటు సభ్యులు, వ్యూహకమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఆ మూడు పార్టీలపై ఎదురుదాడికి దిగాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆపే కుట్ర ప్రారంభమైందన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని జనసేన, వైసీపీ, బీజేపీ నేతలతో కేంద్రం చెప్పిస్తుందన్నారు. పట్టిసీమ పై కూడా బురద జల్లే కార్యక్రమానికి బీజేపీ దిగిందన్నారు. అయితే వీటికి భయపడకుండా పోరాట పంథాను అనుసరించాలని చంద్రబాబు ఎంపీలకు చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీ మోహన్ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. తెలుగు సినీ పరిశ్రమపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు యావత్ చిత్ర పరిశ్రమనూ బాధించాయని మురళమోహన్ చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఇందుకు చంద్రబాబు తాను రాజేంద్ర ప్రసాద్ ను పిలిపించుకుని మాట్లాడతానన్నారు.