సీఎం కుర్చీలో బాలకృష్ణ

Update: 2018-01-24 11:20 GMT

హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారు. లేపాక్షి ఉత్సవాలు, హిందూపురం అభివృద్ధిపై బాలకృష్ణ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి దేవనేని ఉమ హాజరయ్యారు. అయితే సీఎం కుర్చీలో కూర్చుని సమీక్ష చేయడాన్ని పలువురు అధికారులు తప్పుపడుతున్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఉన్నారు. ఈ సమయంలో బాలకృష్ణ తన నియోజకవర్గంలో జరిగే లేపాక్షి ఉత్సవాలపై సమీక్ష చేసినా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

Similar News