సిటీలో కన్నింగ్ కల్తీగాళ్లు... పారాహుషార్...!

Update: 2018-02-01 02:30 GMT

ఏది నిజం ఏది అబ‌ద్దం.. ఏది క‌ల్తీ ఏది అస‌లు... ఏటు తేల్చుకోలేని దీన స్థితి నేడు... తినే తిండి, తాగే పాలు. పీల్చే గాలి స‌ర్వం క‌ల్తీమ‌యం... అనారోగ్యం నుండి కాపాడుకునే వ్యాక్సిన్లను కూడా వ‌ద‌లేదు కల్తీ రాయుళ్లు.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున య‌ధేచ్ఛగా న‌కిలీ దందా చేస్తున్నా విజిలెన్స్ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు... ఈ క‌ల్తీ వ్యవ‌హ‌రం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారుల‌కు తెలియ‌డంతో నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. చిన్నపిల్లలకు ఇచ్చే టెటానస్ వ్యాక్సిన్‌ని ఈ ముఠా రీసైకిల్ చేస్తున్నట్లు బయటపడింది. కాలం చెల్లిన వ్యాక్సిన్‌ని తీసుకొచ్చి కొత్తవ్యాక్సిన్‌గా లేబుల్స్‌ అంటించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. కొత్తడేట్‌తో తయారు చేస్తూ నకిలీ వ్యాక్సిన్ ప్రభుత్వానికే విక్రయిస్తున్నారు ఈ కేటుగాళ్లు.

గుట్టు చప్పుడు కాకుండా....

గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్రింటింగ్ ప్రెస్ పేరుతో న‌కిలీ వ్యాక్సిన్స్‌ని త‌యారు చేస్తున్న వీరిని మ‌నం ఏమ‌నాలి... చిన్న పిల్లల ఆరోగ్యం ఏమైనా ప‌ర్వాలేద‌నుకునే ఈ క‌ల్తీగాళ్లను ఏలా శిక్షించాలి... ఇదిగో ఇక్కడ క‌నిపిస్తున్న ఈ క‌ల్తీ ముష్కరులే న‌కిలీ వ్యాక్సిన్లను త‌యారు చేస్తున్నారు...అంబర్ పేటలో వ్యాక్సిన్ రీసైకిలింగ్ చేస్తున్న కర్మాగారంలో అధికారులు సోదాలు నిర్వహించారు. లక్షల సంఖ్యలో నకిలీ వ్యాక్సిన్ బాటిల్స్‌ను సీజ్ చేశారు. యజమానితోపాటు పలువురిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదో పెద్ద దందా....

చెత్తలో పడేయాల్సిన టీటీ వ్యాక్సిన్‌లను రీసైక్లింగ్ చేస్తూ... మార్కెట్లోకి స‌ర‌ఫ‌రా చేస్తుంది డానో కంపెనీ... డీడీ కాల‌నీలోని ఉన్న డానో కంపెనీ... ఇదిగో ఇక్కడ క‌నిపిస్తున్న ఈ డానో కంపెనీ అడ్డాగా రీసైకిలింగ్ న‌డుస్తుంది... డానో కంపెనీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ దందా సాగుతున్నట్టు తేలింది. ఇక ప్రధాన కార్యాల‌యం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని నేష‌న‌ల్ హైవే ప‌క్కన ఉంది... డానో వ్యాక్సిన్స్ అండ్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇక్కడ క‌నిపిస్తున్న ఈ కంపెనీ 30 ఏండ్లుగా టీటీ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నది. ఈ కంపె నీ డైరెక్టర్ వేణుగోపాల్‌రాజు ఆధ్వర్యంలో అంబర్‌పేట్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొ ని ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఏఆర్‌ఎస్ ప్యాకేజింగ్ అంటూ ఓ బోర్డు పెట్టా రు. ఘట్‌కేసర్‌లోని కంపెనీలో వ్యాక్సిన్లు తయారుచేసేటప్పుడు మూతలు సరిగా పట్టకపోవడం, ఇతరాత్రా కారణాలతో కొన్నింటిని పక్కనపడేస్తారు. వాటిని చెత్తకుప్పల్లోకి తరలించాల్సి ఉంటుంది. అయితే పక్కన పడేసిన బాటిళ్లను అంబర్‌పేటకు తరలిస్తున్నారు. అక్కడ రోజువారీ కూలీలతో వ్యాక్సిన్‌ను ఒక బాటిల్ నుంచి మరో బాటిల్‌లోకి మార్చి మూతలు బిగిస్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్‌లో ఉండే కంపెనీకి సంబంధించిన ఉద్యోగి వాటిని పరీక్షించిన తర్వాత తిరిగి ఘట్‌కేసర్‌కు పంపిస్తారని పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ లో తేలింది.

ప్రత్యేకంగా స్టిక్కరింగ్....

కంపెనీలో వాటిని అప్పుడే తయారు చేసినట్టు స్టిక్కరింగ్, ప్యాకింగ్ చేసి గోడౌన్‌కు తరలిస్తారు. ఈ రిసైక్లింగ్ చేసిన వ్యాక్సిన్లను కంపెనీలో తయారైన ఇతర వ్యాక్సిన్లతో పాటు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. సాధారణంగా టీటీ వ్యాక్సిన్లను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉంచాలి... కానీ ప్రింటింగ్ ప్రెస్‌లో సాధారణ ఉష్ణోగ్రతలో బాటిళ్లను ఉంచడమే కాకుండా, వాటి మూతలను తెరిచి వేరే బాటిళ్లలోకి మారుస్తున్నారు. ఇలా చేస్తూ కాసులు కుమ్మరించుకుంటున్నారు ఈ క‌న్నింగ్ క‌ల్తీగాళ్లు... ఇప్పుడు ఇన్వేస్టిగేష‌న్ న‌డ్డుస్తుంది... ఇన్వేస్టిగేష‌న్‌లో ఇంకెన్ని భ‌యంక‌ర నిజాలు బ‌య‌ట‌ప‌డుతాయో... వేచిచూడాలి...

Similar News