సిక్కోలులో సీఎం ప్లాప్ షో

Update: 2018-01-01 10:30 GMT

రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ కాదు రియ‌ల్ టైం ఎర్ర‌ర్ లా ఉంది ఏపీ స‌ర్కార్ ప‌నిత‌నం. క‌నీసం సీఎం మాట‌కు కూడా విలువివ్వ‌ని చందంగా స‌చివాల‌యం ఉంది అంటే ఏం అనుకోవాలి.. ముఖ్యంగా ఆన్ లైన్ స‌మ‌స్యల పరిష్కార వేదిక‌గా రూపుదిదుకున్న రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ గానీ టోల్ ఫ్రీ నంబ‌ర్ 1100 కానీ ఏవీ స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డం లేదు అనేందుకు సాక్షాత్తూ చంద్ర‌బాబు కు అందుకుంటున్న నివేదిక‌లే తేట‌తెల్లం చేస్తున్నాయి. సిక్కోలులో కానీ విజ‌య‌న‌గ‌రంలో కానీ సీఎం డ్యాష్ బోర్డ్ నుంచి ఆదేశాలు వ‌చ్చినా కూడా అధికారులు ప‌నిచేయ‌డం లేదు అన్న‌ది ఓ వాస్త‌వం. ఇదే గ‌ణాంకాలు కూడా చెబుతున్న నిజం.

అమాత్యులు ఏం చేస్తున్న‌ట్లు,,,;

జిల్లాకు మొత్తం ముగ్గురు మంత్రులు ప‌నిచేస్తున్నారు. అచ్చెన్న... క‌ళా వెంకట్రావు... పితాని సత్యనారాయణ.. వీరి ముగ్గురిలో అచ్చెన్నే చురుగ్గా ఉంటారు. ఏవో కొన్ని త‌ప్పిదాలు మిన‌హా ఆయ‌నే కాస్తో కూస్తో .. మిగ‌తా ఇద్ద‌రిలో క‌ళా వెంక‌ట్రావు అటు స‌మ‌స్య‌ల విష‌యంలో కానీ ఇటు సామాన్య‌జ‌నానికి అందించాల్సిన సంక్షేమం విష‌యంలో కానీ చొర‌వ తీసుకోరు. అందుకే ఆయ‌న కేవలం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం అయిన మంత్రి. ఇక పితాని స‌త్య‌నారాయ‌ణ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ జిల్లా అభివృద్ధిపై ఆయ‌న చూపే ప్ర‌భావం చాలా త‌క్కువ‌.

హ్యాపీ ఇండెక్స్ ఏం చెప్పిందో చూద్దాం...

- రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వం హ్యాపీనెస్ ఇండెక్స్ కోసం తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లో 50 శాతం వరకు సంతృప్తి రాగా, కడప జిల్లాలో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి.

- విశాఖ‌లో ముఖ్య‌మంత్రి చేప‌డుతున్న ప‌నుల‌పై సంతృప్తిగానే ఉన్నారు. కానీ సిక్కోలు వాసులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. విజ‌యన‌గ‌రం వాసుల‌దీ ఇదే అభిప్రాయం.

ఇవీ స‌మ‌స్యలు....

- ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తిలో విఫ‌లం

- ఎచ్చెర్ల కేంద్రంలో ట్రిపుల్ ఐటీ భ‌వన నిర్మాణాలపై నిర్ల‌క్ష్యం

- కొవ్వాడపై స్ప‌ష్ట‌త క‌రువు

- పోలాకిలో థ‌ర్మ‌ల్ వ‌ద్ద‌ని త‌గువు

ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా అధికారుల్లో జ‌వాబుదారీత‌నం లోపించ‌డం..

మ‌రీ ముఖ్యంగా కార్యాల‌యాల ప‌నితీరుపై ప‌ర్య‌వేక్ష‌ణ కొర‌వ‌డ‌డం ..

ఇ - గ‌వ‌ర్నెన్స్ పూర్తి స్థాయిలో ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డం. ఇవి ప‌రిష్క‌రిస్తేనే సీఎంకు పాస్ లేదంటే ఫెయిలే!

Similar News