సిక్కోలులో వైసీపీ సూపర్ ప్లాన్

Update: 2017-10-19 13:30 GMT

సిక్కోలు రాజకీయం మారుతోంది. సామాజిక వర్గాల సమీకరణ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. సిక్కోలు పార్లమెంటరీనియోజకవర్గంలో 22 శాతం ఉన్న కాళింగులకు వైసీపీ పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇక్కడ మున్నూరు కాపు, కాళింగ, యాదవ, దళిత వంటి సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. టీడీపీ అధిష్టానం నిర్ణయంతో కాళింగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధికార పార్టీ కాళింగులకు కేవలం ప్రభుత్వ విప్, జడ్పీ ఛైర్మన్ పదవి మాత్రమే ఇచ్చింది. మున్నూరు కాపు సామాజిక వర్గం నేతల ఆధిపత్యం పెరిగిపోయిందన్నది ఇక్కడి కాళింగుల ఆవేదన. పలాస నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ ఛైర్మన్ ను ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ టార్గెట్ చేయడంతో కాళింగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్ని ఈసారి వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం, పాతపట్నం, ఆముదాల వలస, శ్రీకాకుళం, నరసన్న పేట నియోజకవర్గాలున్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో మున్నూరు కాపుల తర్వాత కాళింగ సామాజిక వర్గమే బలమైనది. ఇప్పటికి పదిహేను సార్లు సిక్కోలు పా

కిల్లి కాకుంటే......?

శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రస్తుతం కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రన్నాయుడి కోటలో పాగా వేయాలంటే కాళింగులకు ఎంపీ సీటు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ టీం నివేదిక కూడా అలాగే ఉండటంతో సరైన అభ్యర్థి కోసం వెదుకులాటను ప్రారంభించారు. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడనేది తేలాల్సి ఉంది. కృపారాణితో పాటుగా విశాఖలో నివాసంముంటున్న సిక్కోలుకు చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యుల పేర్లను కూడా వైసీపీ నేతలు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు వైద్యులు సేవాకార్యక్రమాల్లో చురుగ్గా ఉండటంతో సిక్కోలు ప్రజలకు సుపరిచితమే. అందుకోసం వీరిలో ఒకరికి సీటు ఇచ్చినా ఫలితం అనుకూలంగా వస్తుందని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారు. మరోవైపు కిల్లి కృపారాణి అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు కూడా అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తం మీద సిక్కోలు ఎంపీ సీటుపై వైసీపీ కన్నేసింది.

Similar News