సిక్కోలులో చినబాబు టీం ఇదే...!

Update: 2017-12-21 09:30 GMT

నిండు చందురుడు ఓవైపు చుక్కలు ఓ వైపు నేను ఒక్కడి ని ఓ వైపు లోకం ఓ వైపు విన్నారుగా ఈ పాట.. ఇప్పుడిదే మంత్రి అచ్చెన్నకూ వ‌ర్తిస్తుంది. ఆయ‌నని బాబు త‌న స‌న్నిహిత వ‌ర్గంలో ఒక‌రిగా చూస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో చినబాబు లోకేష్ కు మ‌రికొంద‌రు ద‌గ్గరై మంత్రి కింజరాపున‌కు చెక్ పెట్టేందుకు యోచిస్తున్నారు.

అచ్చెన్న టీంకు చెక్....

అంతేకాదు మంత్రి క‌ళా వెంక‌ట్రావుతోనూ ఆయ‌న స‌న్నిహితంగా మెలిగారు. ఒక‌నాటి స్పీక‌ర్ ప్రతిభా భార‌తితో మాట్లాడారు. ఇలా ఒక్కొక్కరినీ పిలిపించుకోవ‌డ‌మే కాక టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష‌ని పార్టీ ప‌రిస్థితి ఏ విధంగా ఉందో కూడా అడిగి తెలుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఆమె నాయ‌క‌త్వ ప‌టిమ‌పైనా వివ‌రాలు ఆరా తీసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గౌతు శిరీష‌కు పోటీ చేసే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని అన్నార‌ని స‌మాచారం. ఇప్పటికే ప‌లాస ఎమ్మెల్యేగా శిరీష తండ్రి శివాజీ ఉన్నారు.ఆయ‌న స్థానంలో ఈమెను తేనున్నారు. కానీ ఇది స‌ఫ‌లీకృతం అవుతుందో లేదో అన్నదే తెలియ‌రావ‌డం లేదు. మ‌రోవైపు వైఎస్సార్ సీపీ ఇక్కడ క్రమంగా పుంజుకుంది. ఇటీవ‌ల మాజీ ఎమ్మెల్యే జుత్తు జ‌గ‌న్నాయ‌కులు మ‌ర‌ణించడంతో, ఆయ‌న భార్య వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున పోటీచేసేందుకు సై అంటున్నారు. క‌నుక టీడీపీ నేత‌లంతా ఏక‌తాటిపై నిలిస్తేనే శిరీష గెలుపు షురూ అవుతుంది. ఇక్కడ మ‌రో మ‌త‌ల‌బు కూడా తెర‌పైకి వ‌చ్చింది. ఇచ్ఛాపురం ప్రస్తుత ఎమ్మెల్యే అశోక్ ని కాద‌ని శిరీష‌ని తేవాల‌న్నది ఓ ప్లాన్‌.. ఇందుకు చిన‌బాబు ఓకే అన్నారో లేదో అన్నది సంబంధిత వ‌ర్గాలు పైకి ఏమీ చెప్పడం లేదు. ఇక ఎంపీ రామూ సైతం లోకేశ్ వైపే ఉన్నారు. విప్ కూన మొద‌లుకొని మిగ‌తా కీల‌క నేత‌లంతా చిన‌బాబు వెంటే న‌డిచేందుకు, అచ్చెన్న హ‌వాకు చెక్ చెప్పేందుకు

ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఆ ముగ్గురూ రావొచ్చునా..

జిల్లా రాజ‌కీయాల్లో శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి వార‌సుడు విశ్వనాథం , ప్రతిభా భార‌తి కూతురు గ్రీష్మ, క‌ళావెంక‌ట్రావు కొడుకు మ‌ల్లిక్ నాయుడ్ని సైతం పాలిటిక్స్ లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. వీరిని సైతం చిన‌బాబు ప్రోత్సహించే అవ‌కాశాలు పుష్కలం. కొత్త నాయ‌క‌త్వాన్ని తెర‌పైకి తెచ్చే ప్రయ‌త్నంలో ఉన్న లోకేశ్ వీరి ముగ్గురికీ త‌గు ప్రాధాన్యం ఇస్తే ఎలా ఉంటుంద‌న్నది ఆలోచిస్తున్నారు. ఇప్పటికే గ్రీష్మని ప్రతిభా భార‌తి చిన‌బాబుకు ప‌రిచ‌యం చేశారు.అదేవిధంగా మొన్నటి చిన‌బాబు ప‌ర్యట‌న‌లో క‌ళా కొడుకు చాలా యాక్టివ్ గానే వ్యవ‌హ‌రించారు. ఇక ల‌క్ష్మీ దేవి చిన కుమారుడ్ని ఎప్పటి నుంచో తెచ్చేందుకు యోచిస్తున్నారు. ఇవ‌న్నీ ఓకే అయితే చిన‌బాబు టీం బ‌లోపేతం అయిన‌ట్లే!

Similar News