ఆయన రాజకీయ వ్యూహం ముందు ప్రత్యర్థి మోకరిల్లాలిసిందే. ఒంటరి గా పోరాటం మొదలు పెట్టి అందరు ఆ ఉద్యమంలో భాగం కాక తప్పని పరిస్థితి కల్పించి తెలంగాణ సాధనలో తనదైన ముద్ర వేయించుకున్న ధీశాలి ఆయన. అలా సాధించిన తెలంగాణ కు రాజైన కేసీఆర్ ప్రపంచ తెలుగు మహా సభలను అపూర్వ రీతిలో ఐదురోజులపాటు యజ్ఞంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా తొలి రోజు కేసీఆర్ అచ్చ తెలుగు ప్రసంగంతో అందరిని కట్టిపడేశారు. ఇప్పుడు తాజాగా మాతృభాషపై తన మమకారాన్ని వినూత్నంగా చాటి చెప్పారు. నలభైయేళ్ళ క్రితం కంఠతా చేసిన పద్యాలను అలవోకగా అప్పగించి సాహిత్య అభిమానులతో జేజేలు కొట్టించుకున్నారు. భాషాభిమానులు గులాబీ బాస్ పద్యాలు వల్లెవేసిన తీరుకు అబ్బురపడి ఫిదా అయ్యారు. ఏనాడో నలభై ఏళ్ళనాడు దాదాపు మూడు వేల పద్యాలు నేర్చుకుని దారి తప్పి మళ్ళీ ఈ దారికి వచ్చానని సాహితీ సభలో సభికుల హర్షధ్వనాలమధ్య వెల్లడించారు.
కేసీఆర్ కుటుంబ మహాసభలన్న విహెచ్ ...
రాబోయేది ఎన్నికల కాలం కనుక ఏ చిన్న అవకాశాన్ని విపక్షాలు వదిలి పెట్టడానికి సిద్ధంగా లేవు. కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మాహా సభలు కావని అవి ఆయన కుటుంబ సభ్యుల కోసం పెట్టిన కార్యక్రమాలని ఎద్దేవా చేశారు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంత రావు. తెలంగాణ లో వున్న విపక్షాలను ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు విహెచ్. పనిలో పనిగా చంద్రబాబు కు ఆహ్వానం ఎందుకు పంపలేదని కడిగేశారు. విపక్షాలు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు వారు కాదా అని ప్రశ్నలు సంధించారు. ఇద్దరు తెలుగు సీఎం లు గవర్నర్ ను తరచూ కలుస్తారని, పెళ్లిళ్లకు వెళ్లివస్తుంటారని, అమరావతి శంఖుస్థాపనకు చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించినా ఆయన ఇప్పుడు ఎందుకు పిలవలేదో అర్ధం కావడం లేదని నిప్పులు చెరిగారు.