సర్కార్ కి హై కోర్టు మొట్టికాయ ...!

Update: 2017-12-01 02:39 GMT

తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ గందరగోళంలో పడింది. టి సర్కార్ ఇచ్చిన జీవో హై కోర్టు కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ లోని 10 జిల్లాలకు లోబడి ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీ జరగాలని హై కోర్టు ఆదేశించడంతో సర్కార్ కి మొట్టికాయలు పడ్డాయి. 31 జిల్లాల పరిధిలో నిర్వహించ తలపెట్టిన పరీక్షను సైతం వాయిదా వేస్తూ డిసెంబర్ 15 ను ఈ తేదీని పొడిగించింది కోర్టు. తెలంగాణ లోని పది జిల్లాల ప్రాతిపదికనే రిక్రూట్ మెంట్ నిర్వహించాలని ఆదేశించింది.

నిరుద్యోగుల హర్షం ....

దాంతో ఈ సమస్యపై కోర్టు కెక్కిన నిరుద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా నడుస్తూ జీవో విడుదల చేసిందని విమర్శించాయి. పరిపాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించినట్లు చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత ఆ విధంగా నడుచుకోవడం లేదంటూ నిరుద్యోగులు కోర్టు కెక్కిన అంశం తెలిసిందే. దీనివల్ల అనేక సమస్యలు ఎదురు కావడంతో బాటు తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని అంటున్నారు. దీనిపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వం అనాలోచితంగా రాజకీయ కోణాల్లో అలోచించి నిరుద్యోగుల భవిష్యత్తు బలిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

Similar News