సైదాబాద్ కు చెందిన దీపిక అనే యువతిని జహీరాబాద్ కు చెందిన అంకుష్ తో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటినుంచి అతను,అతని కుటుంబ సభ్యులు మామ చంద్ర కాంత్, అత్త అరుణ వేదిస్తున్నారు. అంకుష్ సంసారానికి పనికి రాడని, అతను గే అని తెలియడంతో దీపిక బోరు మంది. అయితే కుటుంబ పరువు బజారున పడటంతో ఆమె ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. అంకుష్ తల్లి దండ్రులు కూడా ఈ విషయం పెళ్లికి ముందు చెప్పలేదు. అయితే దీపిక పై వేధింపులు ఎక్కువ కావడం, కూకట్ పల్లిలో స్వలింగ సంపర్కం కోసం కూకట్ పల్లిలో యువకులకు గాలం వేయడానికి అంకుష్ ప్రత్యేకంగా ప్లాట్ తీసుకోవడతో ఆవిషయంపై దీపిక నిలదీసింది. దీంతో దీపికను తన కారులో తీసుకెళ్లిన అంకుష్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వదిలేసి వచ్చాడు. ఈవిషయం అమ్మానాన్నలకు చెప్పడంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంసారానికి పనికి రాడని తెలిసినా ఎందుకు తనకిచ్చి పెళ్లి చేశారని దీపిక నిలదీస్తుంది. నెల్లూరు రాజేష్ సంఘటన మరవకముందే హైదరాబాద్ లో మరో సంఘటన జరగడం గమనార్హం.