శ్రీదేవి అంటే పిచ్చ ప్రేమతో తల్లడిల్లే రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికపై రోజుకో రకంగా తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి చెందిన రోజు నుంచి వర్మ మనసు మనసులో లేదు. శ్రీదేవి మరణంతో కోలుకోలేకపోతున్న వర్మ ఇప్పుడు ఎప్పుడు వెలుగు చూడని అంశాలను తన లేఖ లో అభిమానులతో పంచుకుంటున్నా అంటూ విడుదల చేశారు. వర్మ అభిమానులకు అంటూ వ్రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియా లోను ఛానెల్స్ లోను చక్కర్లు కొడుతోంది. శ్రీదేవి భక్తుడిగా ప్రేమికుడిగా వర్మ ఇంతకి ఏమి చెప్పారు.
ఆమె మౌనం చాలా విషయాలను చెప్పేసింది ...
వర్మ రాసిన లేఖలో అంశాలు ఈవిధంగా వున్నాయి. శ్రీదేవి కోసం అందరికి తెలిసినవి ఆమె అందం, అభినయం, ఆపార సంపద మాత్రమే. శ్రీదేవి అందరికి చెందినది. అందరి జీవితాల్లోను విభిన్న కోణాలు దాగివున్నట్లే ఆమె జీవితంలోను వున్నాయి. అద్భుతమైన మొహం, అంతే అద్భుత నటన, ఇద్దరు పిల్లలు చక్కగా సాగుతుంది ఆమె పయనం అనుకుంటాం. కానీ దాని వెనుక వున్నవి చాలా మందికి తెలియవు. శ్రీదేవి నాకు క్షణ క్షణం సినిమానుంచి తెలుసు. కెరియర్ తోలి రోజ్జుల్లో ఆమె సంపాదన అంతా తండ్రి బ్లాక్ మని భయంతో బంధువులకు, సన్నిహితులకు నమ్మి ఇచ్చి మోసపోయారు. ఆయన మరణం తరువాత వెనక్కి చూస్తే ఆమె సంపాదన అంతా పరుల పాలు అయిపొయింది. ఆ తరువాత ఆమె సంపాదన ను తల్లి వివాదాస్పద ఆస్తుల్లో పెట్టడంతో శ్రీదేవి తీవ్రంగా నష్టపోయింది. తల్లి మరణం తరువాత శ్రీదేవి చేతిలో చిల్లి గవ్వలేదు. ఆ సమయంలో బోనీ కపూర్ మాత్రమే తోడుగా నిలిచారు. ఆమె తల్లికి వైద్యం తప్పుగా చేశారని యుఎస్ లో కోర్ట్ లో కేసు వేశారు ఆయన. అప్పటికి ఆయన కూడా సంపాదించింది సినిమాల్లో తగలేశారు. ఇద్దరి దగ్గర డబ్బుల్లేని పరిస్థితే. శ్రీదేవి ఆస్తిలో సగం తనకు దక్కాలంటూ ఆమె సోదరి శ్రీలత కేసులు వేసి వేధించిన పరిస్థితి వుంది. తల్లి గుప్పిట్లోనే ఆమె జీవితం నడిచింది. ఏనాడు ఆమె కోరుకున్న స్వేచ్ఛ కానీ ప్రశాంత కానీ పొందలేక పోయింది.
బోనికపూర్ తల్లి శ్రీదేవిని కడుపుపై తన్నింది ...
తమ కుటుంబంలో చిచ్చు పెడుతుందని ముంబయిలో ఒక పార్టీలో బోనికపూర్ తల్లి శ్రీదేవి ని కడుపుపై బలంగా తన్నింది. ఎన్నో అవమానాలకు గురిచేసింది. ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలను ఆమె భరిస్తూ వచ్చింది. అందుకే ఆమె చాలా సార్లు మౌనంగానే ఉండేది. కొన్నిసార్లు మాటలకన్నా మౌనమే ఎక్కువ సంగతులు చెబుతుంది. శ్రీదేవి కి ఏనాడు జీవితంలో మనః శాంతి లేదు. నిత్యం అందంగా కనపడాలని ఎన్నో కాస్మొటిక్స్ అలాగే సర్జరీలతోనే తెరవెనుక ఆమె జీవితం నడిచింది. అభద్రత, అశాంతి ఆమెను ఎప్పుడు చుట్టుముట్టే ఉండేవి. హేమామాలిని కుమార్తెలా తన కూతురు జీవితం ఉండకూడదని ఒక పక్క ఆలోచనలు వత్తిడి వెంటాడేవి. శ్రీదేవి చాలా అమాయకురాలు. ఇలాంటి వత్తిడులొనే చాలామరణాలు సంభవిస్తాయి. ముఖ్యంగా విందులు వినోదాల తరువాత ఎంతోమంది చనిపోయిన సందర్భాలు చూస్తూ ఉంటాం. నాకెప్పుడూ చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పే అలవాటు లేదు. కానీ శ్రీదేవి కి మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే డబ్బు పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఎన్నడూ ఆమె ప్రశాంతంగా లేదు కనుక. ఆమె ఆత్మ కైనా తాను కోరుకున్న ప్రశాంతత ఇప్పుడైనా లభించాలని కోరుకుంటున్నా అంటూ వర్మ అభిమానులకు లేఖలో వ్రాసుకొచ్చారు.