అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా కుమార్తె మాలియా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి ఫ్రెచ్ కిస్ పెడుతూ సిగరెట్లు కాలుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా లో ప్రపంచ వ్యాప్తంగా చక్కెర్లు కొడుతున్నాయి. మాలియా తన బాయ్ ఫ్రెండ్ తో జోష్ గా వున్న ఫోటోలను అమెరికన్ మీడియా ప్రచురించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా లో కొందరు పోస్ట్ చేశారు. అవి వైరల్ గా మారడంతో వివాదాస్పదం అయ్యింది.
మండిపడిన అధ్యక్షుల కుమార్తెలు....
ఈ వ్యవహారంపై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా తీవ్రంగా మండిపడ్డారు. అమెరికన్ మీడియా కు మాలియా ప్రయివేట్ జీవితంలోకి చొరబడే హక్కు లేదంటూ, సంచలనాలకోసం మీడియా దిగజారుతుందంటూ ట్వీట్ చేశారు. మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా కూడా మాలియా కు మద్దత్తుగా నిలిచింది. అమెరికన్లు సైతం ఒబామా కుమార్తె కు సపోర్ట్ గా మీడియా కు వ్యతిరేకంగా స్పందించడం విశేషం. మాజీ అధ్యక్షుల పిల్లలను టార్గెట్ చేయడం అందులోను ఆడపిల్లల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియదా అంటూ విమర్శలు అక్కడ వెల్లువెత్తుతున్నాయి.