సంగీత సరస్వతి మంగళంపల్లి కన్నుమూత

Update: 2016-11-22 12:03 GMT

సంగీత సరస్వతి పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నై లోని తన స్వగృహంలో అయన పరమపదించారు

1930 జూలై 6 నా తూర్పు గోదావరి జిల్లా శంకర గుప్తం లో మంగళంపల్లి జన్మించారు. అయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. కర్ణాటక సంగీత విద్వాంసుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. గట్రా సంగీతంతో పటు, కంజీరా, వయోలిన్, మ్రిదంగం లో అయన నిష్ణాతులు. సంగీత సాధనతో కొత్త రాగాలను కూడా ఆవిష్కరించిన మహనీయుడు.

బాల్యంలో సంగీతం పట్ల అయన అనురక్తిని గమనించి, అయన తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద శిష్యరికం చేయించారు. అక్కడినుంచి మంగళంపల్లి సంగీత జగత్తులో దేశం గర్వించదగ్గ హిమోన్నత శిఖరాలను అధిరోహించారు.

అయన మృతి పట్ల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు.

Similar News