పేర్లెందుకు కానీ ఓ ప్రధాన అర్చకుడి శైలి వివాదస్పదం అయితే దీనినే అదునుగా చేసుకుని ఓ స్వామిజీ సీన్ లోఎంటరైపోయారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇద్దరిపై ఇప్పటికే లెక్కకు మిక్కిలి ఆరోపణలు ఉన్నాయి.. ఓ సాంస్కృతిక సంస్థ నడిపి ఆయనపై, ఓ సాధుపరిషత్ నడిపి ఈయనపై.. ఇక వీరిలో మిస్టర్ క్లీన్ ఎవరని?? ఇప్పుడు చెప్పండిక తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని! ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరవసవల్లిలో చోటుచేసుకుంటున్న కొన్ని వివాదాలపై ప్రత్యేక కథనం.. ఇటీవల స్వామి ద్వారపాలకుడు పింగళుని పాదాల అచ్చులు ప్రయివేటు వ్యక్తులకు అందజేసిన ప్రధాన అర్చకుడి వైనంపై అందిస్తోన్న సవివరం ఇది.
ఆ..ఆలయం.. వివాదాలమయం...
అరసవల్లి పుణ్యక్షేత్రం అని అంతా భావించడం సరే కానీ అక్కడ జరిగే అవకతవకలు అన్నీ ఇన్నీ కావు. ఈఓశ్యామలా దేవీ పనితనం ఏమన్నది అందరికీ తెల్సిందే.. ఆమె అసమర్థతే అన్ని వివాదాలకూ కారణం.బడ్జెట్ హోటల్ మొదలుకుని ఇప్పుడీ పింగళుని అచ్చు వివాదం దాకా అన్నీ అన్నీ ఆమె కారణంగానే జరిగిపోతున్నాయి.వీటికి స్వామి ఓ మౌన సాక్షి.బడ్జెట్ హోటల్ స్థలం అరసవల్లి దేవ స్థానానిదేనని తమను కాదని టూరిజం శాఖ కల్యాణ మండపం తప్పేనని ఇప్పుడు చెప్పడం ఏంటి?. ఇంతకాలం ఆ స్థలం లీజుకు తీసుకున్న సంబంధిక వర్గాల వారు ఆలయానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించకుండా ఉంటే ఏం చేస్తున్నారని..? బాగుంది ఇదే ఇప్పుడు రాజకీయంగా లబ్ధి చేకూర్చ నుంది విపక్షానికి.. ఇప్పుడు ఓ పనిచేయండి కలెక్టర్ చెప్పినట్లే అనుమతులు లేని అక్రమ కట్టడాలు కూల్చేయండి.. సాధ్యమా.. టీటీడీ కల్యాణ మండపానికి ఎలానూ టాటా చెప్పేశారు కనుక ఇక మీ ఇష్టం. ఇదే మీ సిస్టం.
అర్చక అండ్ అరాచక ...
ఓ అర్చకుడు తప్పిదం చేశాడు.. ఇక్కడే కాదు శ్రీ కూర్మంలోనూ ఇలాంటి తప్పిదమే జరిగింది. అందులో సత్యం ఉందో లేదో తెలియలేదు కానీ సంబంధిత వ్యక్తి చామర్తి మురళీ కృష్ణ స్వామి వారి అచ్చు బయట వ్యక్తులకు ఇచ్చి అపచారం చేశాడన్నది ఓ ప్రధాన అభియోగం. అలానే ఇక్కడ స్వామీజీ ఆరోపిస్తున్నట్లు ప్రధాన అర్చకుడి చర్య కూడా ఇలానే ఉంది. మరి! ఏకాంత చర్చలెందుకని.. నిన్నటి వేళ ఆలయానికి వెళ్లి .. రచ్చ రచ్చ చేయాలిగా.. మీడియా ఎదుటే ఎందుకని ప్రగల్బాలు అండ్ బీరాలు.. అధ్యక్షా ఆలోచించవయా!
ఆరోపణలే ఆరోపణలు ....
ఇక ఉత్తరాంధ్ర సాధు పరిషత్ నిర్వాహకుడిగా ప్రముఖ మీడియాల నుంచి సన్మానాలు అందుకుంటున్న ఓ మోసకారి స్వామి గతంలోనూ ఇలానే హిందూ ధర్మం పేరిట తన ఆశ్రమ నిర్వహణ స్థలం కొట్టేశారు.ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎన్ఏసీఎల్ నుంచి డబ్బులు గుంజేశారు.. ఇవీ ఆయనపై అప్పట్లో వినవచ్చిన ఆరోపణలు. అంతేనా ఆయనపై ఓ పోలీస్ కేసు కూడా ఉంది.అదీ ఓ మహిళపై ఆయన అసభ్యంగా ప్రవర్తించారని..ఇవి నిజాలో నిందలో పక్కనపెడితే హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడే ఈ స్వాములకు బీఆర్ఏయూ పెద్దలు గతంలో సన్మానాలు చేయడం ఓ గొప్ప విస్మయం. ఇప్పుడు అరసవల్లి వివాదంలో పింగళుడి పాదాల అచ్చు తీసి బంగారం పాదాల తయారీకి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటన్నది అసలు ప్రశ్న. అదీ ప్రయివేటు వ్యక్తులకు ప్రయివేటుగా పిలిచి ఇవ్వడం ఏంటన్నది కొసరు ప్రశ్న.
ఆభరణాల లెక్కేంటట!
ఇక అరసవల్లి క్షేత్రంలో ఉన్న ఆభరణాల లెక్క చెప్పమని స్వామిజీ డిమాండ్ చేస్తున్నారు. ఆయనొక్కరే కాదు ఎప్పటి నుంచో మీడియా కూడా గోల చేస్తోంది.అయినా ఈఓకు ఇవేవీ పట్టవు. ఇవే కాదు ఆమెకు అరసవల్లి అభివృద్ధే పట్టదు. అందుకనో ఎందుకనో 24 గంటల్లో ఆభరణాల లెక్క చెప్పమని ఈఓని స్వామీజీ అడిగితే కుదరదు పొమ్మన్నారు. ఇంత సచ్ఛీలత ఉన్న అధికారులు ఆలయ పవిత్రతను ఎలా కాపాడగలరని..? ఇక ప్రధాన అర్చకుడిపై కూడా కొన్ని ఆరోపణలున్నాయి. గతంలోనూ అర్చకులు, అధికారులు కొట్టుకున్నారు. ఇప్పుడూ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇదంతా ఆధిపత్యం కోసమే! బాగుంది సొంతంగా నడిపే సాహిత్య సంస్థలకు నిధులు ఎలా వస్తాయని.. దేవుడే సొమ్మే ఆ.."మిత్ర"కు దిక్కు. (మిత్ర అనగా అరసవల్లి ఆలయ ప్రధాన అర్చకుడి నేతృత్వాన నడుస్తున్న ఓ వివాదాస్పద సాంస్కృతిక సంస్థ).విన్నారుగా మీరు .. ఈ బాగోతం.. చదివారుగా.. అయినదిపో అపచారం అనకండి.. తప్పులు చేయడం.. వివాదాల్లోఇరుక్కోవడం తెల్సిన వారికి ఇవేవీ పట్టవు. ధనార్జన, స్వీయ ప్రచార కాంక్ష ఉన్నంత కాలం ఆ ప్రత్యక్ష నారాయణుకి నారాయణుడే దిక్కు. శ్రీ సూర్యనారాయణా మేలుకో!!