శాడిస్ట్ భర్తను చంపేసిన ఇద్దరు భార్యలు

Update: 2017-11-19 06:30 GMT

జగద్గిరిగుట్ట లో దారుణం జరిగింది. భర్త ను ఇద్దరు భార్యలు హత్య చేశారు. కుటుంబ కలహాల తోనే హత్య చేశామని భార్యలు చెబుతున్నారు. భర్తను హత్య చేయడంతో ఐదుగురు పిల్లలు అనాధలుగా మారారు. జగద్గిరి గుట్టలోని ఆస్పెస్టాస్ కాలనీలో మహే‍ష్ యాదవ్ నివాసముంటున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు జ్యోతి, పద్మలతో కలిసి ఒకే ఇంట్లో కాపురముంటున్నాడు. మహేష్ కు మద్యం అలవాటుంది. మహేష్ రోజూ మద్యం తాగి వచ్చి ఇద్దరు భార్యలను వేధింపులకు గురిచేసేవాడు.

వేధింపులు తట్టుకోలేకనే.....

భర్త వేధింపులను తట్టుకోలేక ఇద్దరు భార్యలైన జ్యోతి, పద్మలు ఒక నిర్ణయానికి వచ్చారు. భర్తను చంపేయాలని. దీంతో మద్యం తాగి వచ్చి పడుకున్న మహేష్ మెడకు చున్నీతో ఉరి వేసి చంపేశారు. చనిపోలేదని భావించి అనుమానం వచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ ఇంట్లోనుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం వేధింపులు భరించలేకనే భర్తను హత్య చేశామని వారు చెబుతున్నారు.

Similar News