శశికళ గదిలో ఉన్న ఆ లేఖ కీలకమా?

Update: 2018-01-13 17:30 GMT

శశికళ దొరికిన రహస్య లేఖ ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. గుట్కా కుంభకోణం తమిళనాడులో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రభుత్వ అధికారులతో పాటు కొందరు మంత్రులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలింది. వేదనిలయంలో శశికళ గదిలో ఒక లేఖ దొరికింది. 2016 ఆగస్లులో అప్పటి ప్రిన్సిపల్ డైరెక్టర్ ముఖ్యమంత్రి జయలలితకు, డీజీపీకి ఒక లేఖ రాశారు. గుట్కా కుంభకోణంలో రాష్ట్రమంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులకు సంబంధాలున్నాయని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలకూ ముడుపులు అందాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో జయలలితను, డీజీపీని ప్రిన్సిపల్ డైరెక్టర్ కోరారు.

జయకు తెలియకుండా....

అయితే ఆ లేఖను ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ మద్రాస్ హైకో్ర్టు ముందుంచింది. గుట్కా కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ డీఎంకే శానసనభ్యుడు అంబజగన్ ప్రజప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోయెస్ గార్డెన్ లోని శశికళ గదిలో ఈ లేఖ లభ్యమయిందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కుంభకోణంలో రాష్ట్ర మంత్రితో పాటు మరి కొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. నిషేధించిన గుట్కాను రాష్ట్రంలో అక్రమంగా విక్రయించడానికి వీరి మధ్య భారీ డీల్ కుదరింది. అయితే ఆ లేఖ జయలలితకు చేరిందా? లేదా? అన్న అనుమానం కూడా తలెత్తుతోంది. జయలలితకు తెలియకుండా శశికళ ఆ లేఖను తన గదిలో దాచిపెట్టి ఉంటారన్న అనుమానం కూడా కలుగుతోంది.

మంత్రి ఇరుక్కున్నట్లేనా?

అయితే ఈ కుంభకోణంలో మంత్రి విజయ్ భాస్కర్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. రాష్ట్రంలో గుట్కా ఉత్పత్తులను విక్రయించుకోవడానికి మంత్రి విజయ్ భాస్కర్ కు 56 లక్షలు లంచం ఇచ్చానని గుట్కా కంపెనీ యజమాని ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఐటీ విభాగం మద్రాస్ హైకోర్టుకు సమర్పించింది. 2016 ఏప్రిల్ 1వ తేదీన తాను ఈ లంచాన్ని మంత్రి విజయ్ భాస్కర్ కు ఇచ్చానని గుట్కా కంపెనీ యజమాని చెబుతున్నారు. ఇందులో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని పేర్కొంది. అయితే ఈ కేసులో మంత్రి విజయ్ భాస్కర్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లే. ఈ నెల 17వ తేదీన మద్రాస్ హైకోర్టు దీనిపై విచారించనుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు మంత్రి విజయ్ భాస్కర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Similar News