వైసీపీలో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీకి గ్రూపు విభేదాలు తలనొప్పిగా మారాయి. నూజివీడు మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. నూజివీడు మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా 22 వైసీపీయేకైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 8 స్థానాల్లోనే గెలిచింది. అయితే ఛైర్మన్ పదవి విషయంలో వచ్చిన రగడ ముదిరింది. రెండున్నరేళ్లు ఇద్దరు ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం ఛైర్ పర్సన్ గా ఉన్న రేవతి రెండున్నరేళ్లు పూర్తయినా పదవి నుంచి దిగలేదు. దీంతో ఇదే పదవిని ఆశిస్తున్న త్రివేణి వర్గానికి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు.