ప్రధాని మోడీపై విశ్వాసం ఉంటే...ఇక అవిశ్వాసం ఎందుకని చంద్రబాబు వైసీపీ నేతలను ప్రశ్నించారు. నిన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మోడీ పై తమకు విశ్వాసం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ పార్లమెంటు సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోడీ పై కాన్ఫిడెన్స్ ఉంటే ఇక నో కాన్ఫిడెన్స్ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుదిరగవద్దన్నారు. కేంద్రమంత్రిపదవి నుంచి వైదొలిగిన మాజీ మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చారు. అశోక్ గజపతి రాజు లోక్ సభలో 199వ నిబంధన కింద నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో సుజనా చౌదరి నోటీసులు ఇచ్చారు. ఇద్దరూ తాము మంత్రి పదవుల నుంచి వైదొలగడానికి గల కారణాలను వివరించనున్నారు. వైసీపీ బండారాన్ని ఉభయ సభల సాక్షిగా బయటపెట్టాలని చంద్రబాబు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు దిశానిర్దేశం చేశారు.