వైసీపీ నేత వీడియో వైరల్

Update: 2017-11-29 02:35 GMT

మంత్రి పదవి కోసమే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడారా? మంత్రివర్గ విస్తరణ ఉంటే వెంటనే మంత్రి పదవి లేకుంటే ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామని టీడీపీతో ఈశ్వరికి డీల్ కుదిరిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. గిడ్డి ఈశ్వరి పాడేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి గెలిచిన ఆమె పార్టీని వీడే ముందు తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఇందులో గిడ్డి ఈశ్వరి స్పష్టం చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగితే అప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారు. లేకుంటే ఎస్టీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తామన్నారు. ఇంకా ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే పార్టీ మారక తప్పదని ఆమె చెబుతున్న మాటలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. మరోవైపు తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధిని ఆశించే పార్టీ మారానని, అంతకు మించి పదవుల కోసం కాదని ఈశ్వరి స్పష్టం చేస్తున్నారు.

Similar News