వీరిద్దరూ రోడ్డుపైనే ఉంటే....?

Update: 2017-10-26 08:30 GMT

నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ హీటెక్కనుంది. రాజీకీయంగా వచ్చేనెలలో ఏపీ హీటెక్కనుంది. నవంబర్ నెలలో ఏపీ పోలీసులకు కష్టాలు తప్పేట్లు లేవు. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర,మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ రధయాత్ర. దాదాపుగా రెండు పార్టీలకు చెందిన నేతలు వచ్చే నెలలోనే ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. గ్రామసీమల్లో పర్యటించనున్నారు. దీంతో నవంబర్ నెలలో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. జగన్ పాదయాత్ర, పవన్ రధయాత్ర ఒకే నెలలో ప్రారంభం అవుతుండటంతో ఏపీ అంతా టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. దీంతో ఏపీ పోలీసు అధికారులు ఇద్దరు నేతల భద్రతపై ప్రత్యేక సమీక్షను చేయనున్నారు. పాదయాత్ర కాబట్టి జగన్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఎక్కువ బందోబస్తును నిర్వహించనున్నారు. జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ కోసం ఇప్పటికే ఏపీ పోలీసులు వైసీపీ పార్టీని సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు పవన్ రధయాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే నవంబరు మూడో వారంలో బస్సుయాత్ర ఉండవచ్చని జనసేన పార్టీనేతలు చెబుతున్నారు.

నవంబర్ నెలలో హీటెక్కనున్న ఏపీ.....

ఎన్నికలకు ఇంకా సంవత్సన్నర మాత్రమే గడువు ఉంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ముందుగానే విపక్ష నేతలు తమ భవిష్యత్ ను అంచనా వేసుకోవడానికి గ్రామసీమల బాట పడుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడంతో పాటు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు పవన్, జగన్ లు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు టూర్లు ఏపీ పోలీసులకు సవాల్ గా మారింది. పవన్ బస్సుయాత్ర కావడం.. ఆయన ప్రజల్లోకి వస్తే తొక్కిసలాట జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల పోలీసు ఉన్నతాధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పవన్ ఎక్కడికక్కడ బస్సులో నుంచే సభలు పెట్టే అవకాశం ఉన్నా అభిమానులు రెచ్చిపోతే పరిస్థితి ఏంటన్న ఆవేదన పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతుంది. దీంతో నవంబర్ నెల తమకు కష్టకాలమేనంటున్నారు పోలీసులు. మొత్తం మీద ఇద్దరు చరిష్మా కలిగిన నేతలు రోడ్డుపైకి రావడంతో ఏపీ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కనుంది.

Similar News