ఆ గ్రామంలో అందరూ అదృష్టవంతులే... కోట్లు వచ్చి పడ్డాయి. తమ కష్టాలన్నీ గట్టెక్కాయి. దీంతో ఆ గ్రామ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఎక్కడైనా ఒక గ్రామంలో ఒకరో ఇద్దరో లక్కీ ఫెలోస్ ఉంటారు. కాని ఈ గ్రామాన్ని చూస్తే మాత్రం అందరూ లక్కే ఫెలోసే అని చెప్పక తప్పదు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బోంజో గ్రామం ఇప్పుడు జాతీయ పత్రికల్లో శీర్షికలకు ఎక్కింది. అయితే ఇక్కడి ప్రజలకు ఎలాంటి లాటరీ తగల్లేదు. గుప్తనిధులు దొరకలేదు. అయినా సరే అందరూ కోటీశ్వరులయిపోయారు. అది ఎలాగంటే...?
బోంజా గ్రామంలో....
ఈశాన్య రాష్ట్రంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బోంజా గ్రామం చాలా చిన్నది. ఇక్కడ 31 కుటుంబాలు నివాసాలుంటాయి. అందరూ వ్యవసాయం వృత్తిగా జీవించేవారే. అయితే వీరికి రక్షణ శాఖ రూపంలో అదృష్ణం వరించింది. బోర్డర్ లో ఉన్న గ్రామంలో మొత్తం 200 ఎకరాల భూమిని కేంద్ర రక్షణ శాఖ సేకరించింది. అయితే రక్షణ శాఖ తాము తీసుకున్న భూమికి నష్టపరిహారం కింద బాగానే చెల్లించింది. దీంతో ఒక్కక్కరికి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. పక్కాగా పట్టాలను పరిశీలించిన ప్రభుత్వం భూములు కోల్పోయిన వారికి చెక్కులను పంపిణీ చేసింది.
రక్షణ శాఖ యూనిట్ల కోసం....
ఈ గ్రామంలో రక్షణ శాఖ కొన్ని ప్లానింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం భూమి అవసరమైంది. ఆ గ్రామంలో ఉన్న రెండు వందల ఎకరాలు కావాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం గ్రామస్థులను ఒప్పించింది. తొలుత గ్రామస్థులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు పెద్దయెత్తున పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారు భూములు రక్షణ శాఖకు ఇచ్చేశారు. అయితే పరిహారం పొందిన వారిలో ఒకరికి అత్యధికంగా 6.73 కోట్లు రాగా, మరో కుటుంబానికి 2.44 కోట్లు అందాయి. ఒక్కొక్క కుటుంబానికి సరాసరిని కోటి రూపాయలకు పైగానే పరిహారం అందింది. దీంతో ఈ గ్రామం కోటీశ్వరుల జాబితాలో రికార్డులకెక్కింది. దేశం కోసం తమ భూములను ఇవ్వాల్సి వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు.