వైదొలిగారు కాని మూడున్నరేళ్ల స్నేహాన్ని మర్చిపోలేకపోతున్నారు. అటు టీడీపీ, ఇటు బీజేపీకి చెందిన మంత్రులు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కుదరదని తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేందమంత్రివర్గంలో ఉన్న సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులను పదవులకు రాజీనామాలు చేయాలని ఆదేశించారు. అయితే వాళ్లు రాజీనామా చేయకముందే ఏపీలో మంత్రులుగా ఉన్న కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు రాజీనామాలు చేశారు.
చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి......
రాజీనామాలు చేసిన అనంతరం శాసనసభలో ఇద్దరూ తమ రాజీనామాలకు కారణాలను వివరించారు. కామినేని శ్రీనివాస్ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబుతోకలిసి పనిచేయడం తనకు గర్వకారణమన్నారు. అలాగే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. చంద్రబాబు సమర్థతే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. చంద్రబాబు నుంచి తానెంతో నేర్చుకున్నానని కామినేని వివరించారు.
బాబు ఎన్నడూ జోక్యం చేసుకోలేదు....
అలాగే మాణిక్యాలరావు కూడా అదే రితిలో చంద్రబాబును ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని భావిస్తున్నానన్నారు. తన శాఖ విషయంలో సీఎం ఎన్నడూ జోక్యం చేసుకోలేదని చెప్పారు. ముఖ్యమంత్రి బాధను తామూ అర్థం చేసుకుంటున్నామని, అయితే రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక చంద్రబాబు కూడా ఈ ఇద్దరు మంత్రుల పనితీరును శాసనసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారికి అప్పజెప్పిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించారన్నారు.
టీడీపీ నుంచి కూడా.....
కేంద్రంలో రాజీనామాలు చేసిన సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కూడా మోడీని పొగిడేశారు. మోడీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలం తమకు అవకాశం కల్పించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందని, దాన్ని కుదరదని చెప్పడం వల్లనే తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ తాము ఎన్డీఏలో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇలా రాజీనామాలు చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగినా విమర్శలు చేయకుండా ప్రశంసలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది.