దీపావళి సందర్భంగా కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పాక్ దేశీయులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఎంతోమంది పాకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చి వైద్యం చేయించుకోవాలనుకుంటున్నారు. వారికి ఇంతవరకూ వీసా దొరకడం లేదు. అయితే దీపావళి సందర్భంగా సుష్మా స్వరాజ్ వారికి తీపి కబురు అందించారు. పెండింగ్ లో ఉన్న అన్ని మెడికల్ వీసాలను మంజూరు చేస్తామని సుష్మా ప్రకటించారు. ఈ మేరకు సుష్మా ట్విట్టర్లో ప్రకటించారు.
అర్హతులున్న మెడికల్ వీసాలన్నీ.....
పాకిస్థానీయులు ఎక్కువగా వైద్యం కోసం భారత్ కు వస్తుంటారు. అయితే వారికి మెడికల్ వీసా దొరకడం కష్టంగా మారింది. తమ బాధలను ట్విట్టర్లో వారు పంచుకుంటుండగా సుష్మా వెంటనే స్పందింస్తున్నారు. ఈ నెలలో దాదాపు ఐదురుగు పాకిస్థానీయులకు మెడికల్ వీసాలు మంజూరు చేశారు. అయితే దీపావళి పర్వదినాన పాక్ దేశస్థులకు శుభవవార్త అందించారు సుష్మా. అన్ని మెడికల్ వీసాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హతలున్న వారందరికీ మెడికల్ వీసాలను మంజూరు చేస్తామని సుష్మా తెలపడం విశేషం.