హైదరాబాదు నగరంలో భారీ వర్షాల తాకిడి ఎక్కువగా ప్రచారానికి నోచుకుంటున్నది గానీ.. నిజానికి ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు జనజీవితాన్ని అతలాకుతలం చేసేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. ప్రభుత్వం కూడా సహాయక చర్యలను పెంచింది. ఇదే సమయంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా రంగంలోకి దిగారు.
ఆ రెండు జిల్లాల్లోని తమ పార్టీ నాయకులకు జగన్ ఫోను చేసి.. వర్ష బాధిత ప్రాంతాల్లో పార్టీ తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పిలుపు ఇచ్చారు.
అయితే ఆ రెండు జిల్లాల్లో కార్యకర్తల పరిస్థితి కూడా వరదల్లో భాగంగానే మారి ఉంటుంది గనుక.. సమీపంలోని ఇతర జిల్లాల నాయకులకు కూడా ఫోన్లు చేసి.. వరద తీవ్రత లేని ప్రాంతాలనుంచి కార్యకర్తలను ఈ జిల్లాలకు సహాయక చర్యల నిమిత్తం తరలిస్తే ఇంకాస్త ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.