కమెడియన్ విజయ్ ఆత్మహహత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకుండా పొయింది. విజయ్ తీసుకున్న సెల్పీ ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని చెప్పిన పోలీసులు ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి విచారణ చేసినట్లుగా కనబడడం లేదు.. అంతేగాకుండా విజయ్ భార్య ను ఇప్పటి వరకు పోలీసులు ప్రశ్నించలేదు. అండర్ గ్రౌండ్ లో వున్న వనిత రెడ్డిని ఇప్పటి వరకు పోలీసులు పట్టుకొలేక పొయారు.. వనిత రెడ్డి ఏకంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తునే వుంది. మరొక వైపు విజయ్ చనిపొయే ముందు తీసుకున్న సెల్పీ లో ముగ్గురు పేర్లను ప్రస్తావించాడు. ఈ ముగ్గురు వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ముఖ్యంగా భార్య వనితతో పాటుగా న్యాయవాది శ్రీనివాస్. ఒక పారిశ్రామిక వేత్త పేరును ఇందులో పెర్కొన్నాడు.
ఎందుకుపోలీసుల నిర్లక్ష్యం.....
అయితే ఇందులో వనిత పాత్ర గురించి చెప్పాలంటే భార్య....వనిత..విజయ్ ను వదిలించుకొవడానికి చాల ప్రయత్నాలు చేసిందనే చెప్పవచ్చును.. అంతేగాకుండా పలు మార్లు బెదిరింపులకు కూడా పాల్పడింది. దీంతో పాటుగా విజయ్ కు ఆనారోగ్య వుందని చెప్పింది. అదికాకుండా విడాకుల కోసం ఇప్పటికే కోర్టులో అప్పీల్ చేసింది. ఇది కూడా కోర్టులో పెండింగ్ లో వుంది. మరొక వైపు తన విడాకులకోసం మూడుకోట్లు ఇవ్వాలని డిమాండ్ కూడా చేసింది. తన పాప కుందనను చూడకుండా ఆంక్షలు విధించింది...ఇక్కడితో ఆగకుండా న్యాయవాది ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడినట్లుగా విజయ్ తన సెల్పీలో చెప్పాడు. ఇందుకు సంబంధించి వనితను పోలీసులు ప్రశ్నించ వలసి వుంది.కాని ఇప్పటి వరకు వనితను పోలీసులు ప్రశ్నించలేదు. విజయ్ అంత్యక్రియలు పూర్తియిన తరువాత వనితను ప్రశ్నించాల్సి వుంది.అయితే అప్పటికే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపొయింది. కరుడు గట్టిన క్రిమినల్స్ ను కొన్ని గంటల్లో పట్టుకుని తమ ప్రతిభను చాటిన సిటి పోలీసులు వనిత విషయంలో ఎందుకు పట్టించుకొవడం లేదో అర్థం కావడం లేదని విజయ్ తండ్రి అంటున్నాడు. ఇక పొతే ఎలాంటి క్రిమినల్ అయినా క్షణాల్లో పట్టుకుని మీడియా ముందు పెట్టే మన సిటి పోలీసులు ఒక్క న్యాయవాది అడ్రస్ ను కూడా కనుగొన లేక పోయారు. ఈ కేసులో పూర్తిగా న్యాయవాది శ్రీనివాస్ కీలకం. ఎందుకంటే విజయ్ కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు తన దగ్గర వున్నాయని బ్లాక్ మెయిల్ చేశాడు.. అంతేగాకుండా కొన్ని శాంపిల్ ఫొటోలను కూడా పంపించాడు.. వీటితో ఖంగుతిన్న విజయ్ తన పరువు బజార్లో పడుతుందని భయ పడిపోయాడు.. మూడు కోట్లుఇస్తే కేసు మొత్తాన్ని మాఫీ చేయిస్తాననిచెప్పాడు శ్రీనివాస్.. అయితే శ్రీనివాస్ జాడను ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపొయారు. ఇకపోతే పారిశ్రామిక వేత్త గురించి .. విజయ్ తో పాటుగా తండ్రి సుబ్బరావు కూడా పారిశ్రామిక వేత్త పేరును చెప్పారు.అయితే ఇక్కడ పారిశ్రామిక వేత్తకు వున్న లింక్ ఎంటో ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని ఒక మీస్టరీ లాంటిది. ఏది ఏమైనా ఈ కేసులో వనిత రెడ్డిని పట్టు లేకపోవడంలో వున్న అంతర్యం ఏంటో అర్థం కావడం లేదని తండ్రి అనూమానం వ్యక్తం చేస్తున్నాడు.