కమెడియన్ విజయ్ సాయి కేసు టివి సీరియల్స్ ని తలపిస్తోంది. రోజుకో సెల్ఫీలతో అతని భార్య సీరియల్ ను సాగదీస్తోంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వేసి పోలీసులకు దిమ్మతిరిగేలా చేస్తోంది. మొత్తానికి ఆమె ఇచ్చే ఫోన్ ఇంటర్ వ్యూలు కేసు నుండి తప్పించుకునేలా ఉన్నాయంటున్నారు పోలీసులు.. ఆత్మహత్య చేసుకున్న విజయ్ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసులు నమోదు చేశామని.. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు కూడా స్వీకరించమంటున్నారు పోలీసులు.. ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లతో సాగుతున్న ఈ సీరియల్ కి శుభ కార్డు వేయాలని పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు.
రోజుకో వీడియో పంపుతూ....
ఆమె బుల్లి తెర నటి.. బ్రతకడానికి ఆమె నటన మొదలు పెట్టింది.. బట్ చివరకు జీవితాన్ని ఓ నాటకం చేసింది. అందులో జీవించి పోలీసులనే అయోమయానికి గురి చేసింది. ఇప్పుడు ఆ నటి వనిత కథే హాట్ టాపిక్ అయిపోయింది. మొదట పెళ్లి చేసుకొని భర్తకు విడాకులిచ్చిన వనిత.. ఆ తరువాత హైదరాబాద్ కి వచ్చి స్థిరపడింది. టివీ సిరీయళ్లలో అవకాశాలు అందిపుచ్చుకొని నటనలో తనదైన ముద్రవేసుకుంది. అప్పుడే కమెడియన్ విజయ్ సాయితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఆ తరువాత పెళ్లి.. ఒక పాప. ఇంత వరకు బాగానే ఉంది. మూడు సంవత్సరాల కిందటే వీరి కాపురంలో కలతలు.. వాటిని తట్టుకోలేక కమెడియన్ విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.విజయ్ చనిపోతూ ఓ సెల్ఫీ తీసుకున్నాడు. తన భార్య.. వ్యాపారవేత్త శశిధర్.. లాయర్ శ్రీనివాస్.. నవయుగ కన్ స్ట్రక్షన్స్ అధినేత సి.వి రావు. వాళ్ల మూడు కోట్ల బెదిరింపులే తన బలవర్మణానికి కారణం అంటూ సుసైడ్ చేసుకున్నాడు. ఈ కేసులో రంగంలోకి దిగిన జూబ్లిహిల్స్ విజయ్ ఫోన్ సీజ్ చేసి పరిశీలిస్తే.. ఎన్నో ఆడియో రికార్డులు.. సెల్ఫీలు దిమ్మతిరిగేేలా చేశాయి. దీంతో విజయ్ భార్య వనితపై కేసు నమోదు చేశారు.
పోలీసులనుతప్పు దారి పట్టిస్తూ...
ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. మణికొండ ఇంటికి తాళం పెట్టిన వనిత రోజుకో సెల్ఫీ వీడియో పంపుతూ పోలీసులను, మీడియాను అయోమయానికి గురి చేస్తోంది.మొదట తన భర్త ఒక చెడ్డవాడని, అతని ఎయిడ్స్ ఉందంటూ ప్రచారం చేసింది. పోస్టుమార్టం షాట్ ఒపీనియన్ రిపోర్టులో డాక్టర్స్ అలాంటి ప్రస్తావన తేక పోవడంతో.. ఇప్పుడు తాను పశ్చాత్తాపం చెందుతున్నట్లు మరో వీడియో విడుదల చేసింది. ఇలా కేసును రోజుకో మలుపు తిరుగుతూ అయోమయానికి గురి చేస్తోంది. కేసును తప్పుదారి పట్టించి ఈ కేసు నుండి ఎలా తప్పించుకోవాలో వనితకు బాగా తెలుసునని విజయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి బతకడానికి నటన మొదలు పెట్టిన వనిత ఇప్పుడు తన లైఫ్ నే ఓ సీరియల్ చేసి వీడియోను, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. చివరకు ఈ కేసుకు ముగింపు ఎలా ఇస్తుందో వనితకే తెలియాలి